← ప్రశ్నపత్రాలు
2. TS Police Constable Prelims - 2018 (Set A) [Telugu]
200 ప్రశ్నలు 0 of 200 answered
Text size
Filter
Jump to
Purchase this subject for 45 days of unlimited access.
View plansMock Test Starting…
00:00
Question 1 of 1
Exit mock test? Your progress on this attempt will be lost.
1. What is the synonym of 'amenable' in 'Both parties were amenable to a peaceful settlement of the land dispute'.?
2. What is the synonym of 'antidote' in 'Jogging is considered an antidote to mental stress'.?
3. What is the antonym of 'transparent' in 'The window-glass is transparent'?
4. What is the antonym of 'unanimous' in 'It was a unanimous decision'?
5. His mother was _________ American though his father was __________ European.
6. The coordinator was asked to attend __________ the issue and resolve it immediately.
7. Either of the roads ___________ to Vasantha Nagar.
8. Please don't disturb me, I _________ the coins now.
9. Rishi __________ his engineering course by the end of 2017.
10. Choose the correctly spelt word from the options given below.
11. What is the meaning of underlined idiom in "We would be glad to put you up for a few days if you would like to stay"?
12. What is the meaning of the underlined phrase in 'How did you wolf down that pizza so quickly'?
13. Choose the correct order of the following jumbled sentences into a meaningful paragraph.
(a) Wages will seldom rise in proportion to the rising prices
(b) The problem of food is intimately connect with population, the market is governed by demand and supply
(c) Without enough food, such people lack health, strength of efficiency and they fall an easy prey to all sorts of diseases
(d) If too many people demand goods to go round, prices will rise and poor classes will starve
14. Choose the correct order of the following jumbled sentences to make it a meaningful paragraph.
(a) A dove, perched on a nearby tree, saw the ant's danger and dropped a leaf into the water
(b) Once, an ant who had come to drink at a stream fell into the water and was carried away by the swift current
(c) He was about to fire when the ant, who was nearby, crawled forward and bit him sharply on the ankle
(d) Sometime after this, a hunter, creeping through the bushes, saw the dove asleep, and took a careful aim with his gun
15. Fill in the blank:
Manoj played cricket for two days, _________ he?
16. Fill in the blank:
Johnson has not prepared for tomorrow's exam, __________ he?
17. How did most people regard early motor cars?
18. What were all early motor cars?
19. What made the English inventors handicapped?
20. What is incorrect about the internal combustion engine?
21. మీరు ఇండియా Vs పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫైనల్ TVలో చూస్తున్నప్పుడు, మీ తమ్ముడు వచ్చి తనకి గణితము సబ్జెక్టులో ఉన్న సందేహాలు తీర్చమని నిన్ను అడిగితే నీవు ఏం చేస్తావు?
22. ఒక బాలుడు ఒక ముఖ్యమైన విషయాన్ని అవగాహన చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నప్పుడు నువ్వు ఎలాంటి సలహా ఆ బాలుడికి ఇస్తావు?
23. ఎవరైనా మిమ్మల్ని కావాలని బాధపెట్టడానికి ప్రయత్నిస్తే, మీరు ఏం చేయాలి?
24. నిన్ను నమ్మి నీ స్నేహితుడు తన యొక్క వ్యక్తిగత సమస్యలను నీతో చెపితే, నువ్వు ఏం చేయాలి?
25. పరీక్షల్లో నీకు వచ్చిన మార్కులు కాకుండా తప్పుడు ఆధారాలతో వేరే మార్కులు వచ్చాయని మీ తల్లిదండ్రులతో చెప్పావా?
26. మీ ఉద్దేశంలో 'లింగ సమానత్వం' అంటే అర్థము ఏమిటి?
27. 'బలహీన వర్గాలు' అనగా అర్థము ఏమిటి?
28. నీవు నీ స్నేహితుని కోసం రెండు గంటల నుండి ఎదురు చూస్తున్నావు, అయినా వాడు ఇంకా రాలేదు. నీవు అతని గురించి ఏమి అనుకుంటున్నావు?
29. నీ ఎదురుగా ఉన్న వ్యక్తి జేబులోంచి డబ్బులు క్రిందపడితే, నీవు ఆ వ్యక్తికి ఇచ్చేస్తావా?
30. ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటూ వుంటే, అక్కడ ఉన్న నువ్వు ఏం చేస్తావు?
31. (1 - 1/2)(1 - 1/3)(1 - 1/4)....(1 - 1/n) =
32. రెండు సంఖ్యల నిష్పత్తి 3:5 మరియు వాటి H.C.F 5. అప్పుడు, ఆ సంఖ్యల L.C.M ఎంత?
33. ఏ సంఖ్య నుండి 11 తీసివేసిన తరువాత 16, 18, 21, 24 మరియు 28 లచే భాగింపబడే సంఖ్యలలో అతి చిన్న సంఖ్య ఏది?
34. A మరియు B యొక్క వయస్సులు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. పది సంవత్సరముల తరువాత, వారి వయస్సుల నిష్పత్తి 31:45 అవుతుంది. వారి ప్రస్తుత వయస్సులు (సంవత్సరములలో)
35. వెండి మరియు రాగిని 2:5 మరియు 4:7 నిష్పత్తులలో కలిపి A మరియు B అనే రెండు లోహ మిశ్రమములను తయారుచేశారు. ఈ లోహ మిశ్రమములు A, B లను సమభాగాలు తీసికొని కలిపి మూడవ లోహ మిశ్రమము C ని తయారు చేశారు. ఈ మిశ్రమము C లో ఉన్న వెండి మరియు రాగిల నిష్పత్తి
36. ఒక దుకాణదారుడు పంచదార ధరను 10% తగ్గించాడు. ఒక వ్యక్తి రూ. 900లో 2 kg ఎక్కువ పంచదార కొనగలడు. 1 kg పంచదార యొక్క అసలు ధరకు, తగ్గించిన ధరకు మధ్య వ్యత్యాసము (రూపాయలలో)
37. ఇద్దరి అభ్యర్థుల మధ్య జరిగిన ఒక ఎలెక్షన్లో నమోదు అయిన ఓటర్లలో 80% మంది ఓట్లు వేశారు. ఈ వేసిన ఓట్లలో (votes) 5% ఓట్లు సరైనవి కావు అని నిర్ణయించారు. గెలిచిన అభ్యర్థికి 32490 ఓట్లు వచ్చాయి. ఇది సరి అయిన ఓట్లలో 60%. అయితే, మొత్తం నమోదు అయిన ఓటర్ల సంఖ్య
38. ఒక వ్యక్తి A, ఒక వ్యాపారమును రూ. 3,00,000 పెట్టుబడితో ప్రారంభించాడు. కొంతకాలము తరువాత రెండవ వ్యక్తి B రూ. 4,00,000 పెట్టుబడితో Aతో చేరాడు. సంవత్సరాంతమున వచ్చిన లాభమును A, B లు సమానముగా పంచుకుంటే, B ఎన్ని నెలల తరువాత A తో చేరినాడు?
39. ముగ్గురు వ్యక్తులు A, B, C లు ఒక కంపెనీని ప్రారంభించి, దాని నిర్వహణకు మొత్తం రూ. P పెట్టుబడిగా పెట్టారు. B కంటే A రూ. 50,000 ఎక్కువ పెట్టాడు, C కంటే B రూ. 50,000 ఎక్కువ పెట్టాడు. A, B, C ల పెట్టుబడులు 8:7:6 నిష్పత్తిలో ఉంటే, P (రూపాయలలో) ఎంత?
40. నాలుగు వరస సంఖ్యలు A, B, C, D ల సగటు 55.5. అప్పుడు, లబ్ధం BC =
41. ఒక క్రికెటర్ యొక్క బౌలింగ్ (bowling) సగటు ఒక వికెట్‌కు 9.5 పరుగులు. ఆ తరువాత మేచ్‌లో అతను 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మేచ్ తరువాత అతని బౌలింగ్ సగటు 0.1 పరుగులు తగ్గింది. ఈ మేచ్ ముందు అతను తీసుకున్న మొత్తం వికెట్ల సంఖ్య
42. ఒక వ్యక్తి తన వద్ద ఉన్న సరుకులలో 2/3 వ వంతు, 35% లాభమునకు అమ్మాడు. మిగతా సరుకులను 23% లాభమునకు అమ్మాడు. అప్పుడు అతనికి మొత్తం అమ్మకములో వచ్చిన లాభ శాతము
43. ఒక వస్తువును రూ. 950 కు అమ్మితే వచ్చిన లాభము, అదే వస్తువును రూ. 650 కి అమ్మితే వచ్చే నష్టానికి రెండు రెట్లు. ఆ వస్తువును ఏ ధరకు అమ్మితే 30% లాభము వస్తుంది?
44. అసలు సొమ్ము P మీద సాధారణ వడ్డీ P లో 1/50 భాగము అయి, మరియు సంవత్సరాల సంఖ్య సాధారణ వడ్డీరేటులో సగభాగము అయింది. అప్పుడు సంవత్సరపు వడ్డీరేటు
45. ఒక బాంకు, A అను వ్యక్తికి రూ. 3,00,000 లను సాధారణవడ్డీ 8% చొప్పున మరియు B అను వ్యక్తికి రూ. 2,00,000 లను సాధారణ వడ్డీ 10% చొప్పున T సంవత్సరములకు అప్పు ఇచ్చింది. ఆ కాలము పూర్తి అయిన తరువాత బాంకుకు రూ. 1,76,000 వడ్డీ వస్తే, T = (సంవత్సరములలో)
46. ఒక బాంకులో సంవత్సరానికి చక్రవడ్డీ 10% చొప్పున 3 సంవత్సరముల కొరకు వేసిన మొత్తములు పట్టిక I లో ఇవ్వబడినవి. పట్టిక II లో చక్రవడ్డీలు ఇవ్వబడినవి. వాటిని జతపరచండి
List - I
(a) 20000
(b) 15000
(c) 10000
List - II
(i) 7850
(ii) 3310
(iii) 4865
(iv) 4965
(v) 6620
47. 6గురు పురుషులు మరియు 8 మంది స్త్రీలు ఒక పనిని 40 రోజులలో పూర్తి చేస్తారు. అదే పనిని 8 మంది పురుషులు మరియు 16 మంది స్త్రీలు 24 రోజులలో పూర్తి చేస్తారు. అదే పనిని 10 మంది పురుషులు మరియు 8 మంది స్త్రీలు ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు?
48. A అను వ్యక్తి ఒక ఇంటిని 30 రోజులలో పెయింట్ చేయగలడు. B అను రెండవ వ్యక్తి అదే ఇంటిని 36 రోజులలో పెయింట్ చేయగలడు. A మరియు B ఇద్దరు కలిసి 15 రోజులు పనిచేశారు. తరువాత A వెళ్ళిపోయాడు. మిగతాపనిని B పూర్తి చేయుటకు కావలసిన సమయము (రోజులలో)
49. ఒక వ్యక్తి 6.30 a.m కు పట్టణము P నుండి పట్టణము Q కి బయలుదేరాడు. అతను 90 km/hr వేగంతో 2 గంటల 30 నిముషములు ప్రయాణించాడు. ఆ తరువాత వేగమును 50 km/hr కి తగ్గించాడు. ఆ పట్టణముల మధ్య దూరము 345 km అయితే, అతను పట్టణము Q కి ఎప్పుడు చేరాడు?
50. ఒక 80 మీటర్లు పొడుగుగల ఒక రైలు 80 km/hr వేగంతో పరిగెడుతున్నది. ఈ రైలు 120 మీటర్లు పొడుగు గల ఒక ప్లాటుఫారం (platform) ను దాటుటకు కావలసిన సమయము (సెకండ్లలో)
51. α మరియు β వర్గ సమీకరణము px²+qx+r = 0 యొక్క మూలాలు అయిన, పట్టిక I మరియు పట్టిక II లో ఇచ్చిన వాటిని జతపరచండి.
List - I
(a) 1/α + 1/β
(b) α/β + β/α
(c) α²+β²
List - II
(i) (q²-2pr)/p²
(ii) (q²+2pr)/pr
(iii) (q²-2pr)/pr
(iv) -q/r
52. 3:4:5 నిష్పత్తిలో భుజములు గల మూడు ఘనములను కరిగించి, 18√3 సెం.మీలు గల వికర్ణము గల ఒక ఘనమును తయారుచేయబడింది. ఆ ఘనముల భుజములు (సెం.మీలలో)
53. ఒక స్తంభ శిఖరానికి అని ఉన్న ఒక నిచ్చెన నేలతో 60° కోణము చేస్తుంది. ఆ నిచ్చెన క్రింది కొన స్తంభమునకు 4 మీటర్ల దూరములో ఉన్నది. ఆ నిచ్చెన యొక్క పొడవు (మీటర్లలో)
54. √1225 + √0.0615+x = 35.25 ⇒ x =
55. 2a = 3b = 4c మరియు a+b+c = 26√61 అయిన, అప్పుడు √(a²+b²+c²) =
56. గతిజశక్తి యొక్క పరిమాణములు ఈ క్రింది వానిలో దేనితో సమానముగా ఉండును
57. నీటిలోని ధ్వనులను కొలుచుటకు ఉపయోగించే పరికరము
58. పది (10) అంగుళాలను కిలోమీటర్లలోనికి మార్చుము
59. ఒక మోనోక్రొమాటిక్ రేడియేషన్‌ను భూమి నుండి దూరముగా ఉన్న గ్రహంపై కిరణపుంజం (beam) చేశారు. అది పరావర్తనము చెంది ఏడు నిమిషాల తరువాత చేరింది. ఒకవేళ సిగ్నల్ యొక్క వేగం 3×10⁸ m/s ఉంటే, భూమి మరియు గ్రహం మధ్య ఉన్న దూరము మీటర్లలో
60. SI యూనిట్లలో ప్లాంక్ స్థిరాంకం (Planck's constant) విలువ
61. ఈ క్రింద పేర్కొన్న వాటిలో ఏది యాంటిబయాటిక్ కాదు
62. డ్రై ఐస్ యొక్క రసాయనిక నామం
63. ఈ క్రింది పేర్కొన్న వాతావరణ పొరలలో ఏది రేడియో కమ్యూనికేషన్స్‌కు సహాయపడుతుంది
64. ఈ క్రింది పేర్కొన్న మూలకములలో దేనికి అతి ఎక్కువ బణువిద్యుదాత్మకత కలదు
65. ఒక ఉష్ణగ్రాహక చర్యలో ΔH అనగా చర్య యొక్క ఎంథాల్పీని వర్ణించినచో, ఉత్తేజిత శక్తి యొక్క అతి తక్కువ విలువ (minimum value) ఎలా ఉండును
66. ఈ క్రింది పేర్కొన్న వాతావరణ పొరలను క్రింది నుండి పైకి సరైన క్రమములో ఏర్పరచుము
A) ఎక్సోస్ఫియర్ B) ట్రోపోస్ఫియర్ C) స్ట్రాటోస్ఫియర్ D) మీసోస్ఫియర్
67. “డార్క్ ఫెర్మెంటేషన్” (Dark Fermentation) అనగా
68. కార్బన్ మోనాక్సైడ్కి సంబంధించి ఈ క్రింది పేర్కొన్న వాటిలో సరైనది ఏది
A) అది మానవ శరీరములో ఉత్పత్తి అగును
B) అది సికిల్ సెల్ ఎనీమియాను చికిత్స చేయుటకు సహాయపడును
C) అది ఒక న్యూరోట్రాన్స్మిటర్లాగా పనిచేయును
69. బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ దేనిని సూచిస్తుంది?
70. కార్బన్ క్రెడిట్ అనగా
71. ఒత్తిడి, కోపము మరియు ఎక్కువ బిపికి ఏ హార్మోన్ బాధ్యత వహిస్తుంది?
72. ఈ క్రింది వాటిలో దేనిని జంతు స్టార్చ్ అంటారు
73. RNA లో న్యూక్లియోటైడ్స్ దేనితో ముడిపడి ఉంటాయి
74. ఇది యూనివర్సల్ ఆక్సెప్టర్ బ్లడ్ గ్రూపు
75. మానవ శరీరములో అతి పెద్ద అవయవం
76. ఈ క్రింది శ్రేణిలో తరువాత వచ్చు సంఖ్యను కనుగొనండి
0, 3, 8, 15, 24, _______
77. క్రింది పటములను పరిశీలించి, ప్రశ్నార్థకము (?) చోట ఉండవలసిన సంఖ్యను కనుగొనండి. మొదటి త్రిభుజం: పైన 1, క్రింద-ఎడమ 3, క్రింద-కుడి 5, లోపలి విలువ 35. రెండవ త్రిభుజం: పైన 2, క్రింద-ఎడమ 4, క్రింద-కుడి 3, లోపలి విలువ 29. మూడవ త్రిభుజం: పైన 1, క్రింద-ఎడమ 4, క్రింద-కుడి 2, లోపలి విలువ ?
78. ఈ క్రింది శ్రేణిలో తరువాత వచ్చు సంఖ్యను కనుగొనండి
1, 1, 2, 3, 5, 8, _____
79. ఈ క్రింది శ్రేణిలో లోపించిన (ఖాళీలోని) సంఖ్యను కనుగొనండి
9, 25, 49, _____ , 169
80. క్రింది పటములను పరిశీలించి, (?) చోట ఉండవలసిన సంఖ్యను కనుగొనండి. మొదటి చతురస్రం: పై వరుస 2,3; క్రింది వరుస 9,4. రెండవ చతురస్రం: పై వరుస 4,6; క్రింది వరుస 36,16. మూడవ చతురస్రం: పై వరుస 5,?; క్రింది వరుస 49,25.
81. క్రింది పటములను పరిశీలించి, P, Q ల విలువలను కనుగొనండి. మొదటి త్రిభుజం: 4, 3, 6. రెండవ త్రిభుజం: 8, 9, 15. మూడవ త్రిభుజం: 5, 8, 10. నాలుగవ త్రిభుజం: 7, P, Q.
82. ఈ క్రింది శ్రేణిలో తరువాత వచ్చు సంఖ్యను కనుగొనండి
3, 10, 24, 45, _____
83. తెలుగు చానెల్స్‌ను వీక్షించే కుటుంబాల సంఖ్య ఎంత?
84. ఇంగ్లీషు చానెల్స్‌ను వీక్షించే కుటుంబాల సంఖ్య ఎంత?
85. హిందీ మరియు తెలుగు చానెల్స్‌ను రెండింటిని వీక్షించే కుటుంబాల సంఖ్య ఎంత?
86. ఒకవేళ ఎరుపును పసుపు పచ్చగాను, పసుపు పచ్చను ఆకుపచ్చగాను, ఆకుపచ్చను నీలంగాను, నీలంను గులాబి రంగుగాను అనుకుంటే, సాధారంగా ఆకులు ఈ రంగులో ఉంటాయి
87. ఒకవేళ UMBRELLA ను VLCQFKMZ గా వ్రాస్తే, JUSTICE అనే పదాన్ని ఇలా సూచిస్తారు
88. ఒకవేళ TBDIJO ను SACHIN కు కోడుగా సూచిస్తే, IZVOEBJ ను ఏ పదానికి కోడుగా సూచించవచ్చు?
89. ఒకవేళ TEN, GANG మరియు MEAT అనే పదాలను వరుసగా 439, 6596 మరియు 1354 గా సూచిస్తే, MANAGEMENT అనే పదాన్ని ఎలా సూచిస్తారు?
90. ఒక సంవత్సరము ఏప్రిల్ ఒకటవ తేదీన ఆదివారము అయితే ఆ సంవత్సరము ఆగష్టు 15వ తేదీ ఏ రోజున వస్తుంది?
91. 15 ఆగష్టు 2016 రోజున సోమవారం అయితే 15 ఆగష్టు 2017న ఏ రోజు అవుతుంది?
92. సెక్రటరీగారు సమావేశమునకు హాజరుపడుటకు 10.10 am కు వచ్చారు. ఆయన చైర్పర్సన్ కంటే 30 నిమిషాలు ముందు వచ్చారు. చైర్పర్సన్గారు సమావేశ నిర్ణీత సమయానికి 10 ని.లు ఆలస్యంగా వచ్చారు. సమావేశ నిర్ణీత సమయము ఎంత?
93. శంకర్ తన తరగతిలో మొదటి నుండి 8వ స్థానంలోను చివరి నుండి 24వ స్థానంలోను ఉన్నాడు. ఆ తరగతిలో మొత్తం విద్యార్థుల సంఖ్య 40 ఉండాలంటే ఇంక ఎంత మంది విద్యార్థులను కలుపాలి?
94. ఒక అమ్మాయి ఒక దిక్కులో 6 కి.మీ. నడిచిన తరువాత ఎడమవైపు తిరిగి మరొక 8 కి.మీ. ప్రయాణించినచో, ప్రస్తుతము ఆమె ఉన్న స్థానానికి మరియు మొదట బయలుదేరిన స్థానానికి ఉన్న దూరం ఎంత?
95. గడియారం 10.00 సమయం సూచించినప్పుడు గంటల ముల్లు ఉత్తర దిశ వైపు సూచిస్తే, ఏ సమయానికి గంటల ముల్లు నైఋతి (south-west) దిశను చూపిస్తుంది?
96. ఇచ్చిన క్రమమును పరిశీలించి, ఎన్ని అక్షరాలు వాటి ముందు ఒక గుర్తును మరియు తరువాత ఒక అంకెను కలిగి ఉన్నాయో గుర్తించండి
M * K 5.L * N 3 X ? P 4 * L M % N 4
97. P, Q, R అనే ముగ్గురు ఇంజనీర్లు ఒక ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. ఈ క్రింది ప్రకటనలను పరిశీలించి, ఆ ముగ్గురు ఇంజనీర్లూ ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారో కనుగొనవచ్చునా?
I. P మరియు Q లు రెండు నెలలలో డిజైన్‌ను పూర్తి చేస్తారు
II. Q మరియు R లు ఒకటిన్నర నెలలలో డిజైన్‌ను పూర్తి చేస్తారు
III. P మరియు R లు మూడు నెలలలో డిజైన్‌ను పూర్తి చేస్తారు
98. ఆరుగురు మిత్రులు A, B, C, D, E మరియు F లు ఒక షడ్భుజి ఆకారం గల బల్ల మూలల (శిరస్సులు) దగ్గర మధ్యకు చూస్తూ కూర్చున్నారు. 'A' F మరియు C ల మధ్యలో కూర్చున్నాడు. B కు కుడివైపు రెండవ వాడు D మరియు D కి ప్రక్కన C ఉన్నాడు.
E కు ఖచ్చితంగా ఎదురుగా ఎవరు కూర్చున్నారు?
99. ఆరుగురు మిత్రులు A, B, C, D, E మరియు F లు ఒక షడ్భుజి ఆకారం గల బల్ల మూలల (శిరస్సులు) దగ్గర మధ్యకు చూస్తూ కూర్చున్నారు. 'A' F మరియు C ల మధ్యలో కూర్చున్నాడు. B కు కుడివైపు రెండవ వాడు D మరియు D కి ప్రక్కన C ఉన్నాడు.
B కు ఇరువైపుల ఉన్న ఇద్దరు ఎవరు?
100. ఆరుగురు మిత్రులు A, B, C, D, E మరియు F లు ఒక షడ్భుజి ఆకారం గల బల్ల మూలల (శిరస్సులు) దగ్గర మధ్యకు చూస్తూ కూర్చున్నారు. 'A' F మరియు C ల మధ్యలో కూర్చున్నాడు. B కు కుడివైపు రెండవ వాడు D మరియు D కి ప్రక్కన C ఉన్నాడు.
D కు ఖచ్చితంగా ఎదురుగా ఎవరు కూర్చున్నారు?
101. సింధు నాగరికతకు చెందిన ఏ ప్రదేశములో అత్యధికంగా బావులు కనుక్కోబడినాయి?
102. ఈ క్రింద ఇవ్వబడిన రెండు వాక్యములు ఒకటి ప్రతిపాదన (A) రెండు కారణము (R)
ప్రతిపాదన (A): ఆర్యులు గంగానది ప్రాంతమునకు విస్తరించడంలో ఇనుప సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యమైన పాత్రను వహించింది.
కారణం (R): గంగానది పరివాహక ప్రాంతమంతా దట్టమైన అరణ్యం ఉండింది. దీన్ని బలమైన లోహ పనిముట్లతో మాత్రమే తొలగించడానికి వీలుంటుంది.
103. క్రింది వాఖ్యానములలో ఏది సరిఅయింది కాదు.
104. ఈ క్రింది వానిలోని ఏ గ్రంధం శృతి వాఙ్మయంలో భాగం కాదు
105. క్రింది వానిని జతపరచుము
జాబితా - I (అశోకుని యొక్క మైనర్ రాతి శాసనములు)
(a) రాజుల మంధగిరి
(b) బ్రహ్మగిరి
(c) నిత్తూర్
(d) రూపనాధ్
జాబితా - II (వీటి యొక్క ప్రస్తుత ప్రాంతం)
(i) చిత్రదుర్గ జిల్లా, కర్ణాటక
(ii) బెల్లారి జిల్లా, కర్ణాటక
(iii) జబల్పూర్ జిల్లా, మధ్యప్రదేశ్
(iv) కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
106. క్రింది వానిని జతపరచుము
జాబితా - I (రచయిత)
(a) ఇలంగోవడిగల్
(b) సత్తైనార్
(c) తిరువల్లువార్
(d) నాథముని
జాబితా - II (గ్రంధము)
(i) మణిమేఖలై
(ii) శిలప్పాధికారం
(iii) నలయిర దివ్య ప్రబంధం
(iv) తిరుక్కురల్
107. క్రింది వానిలో ఏది సరిఅయిన జతకాదు
108. ఈ క్రింది ఆయుర్వేద వైద్యులను వారు నివసించిన కాలాన్ని బట్టి క్రమానుగతంగా వ్రాయుము
a) జీవకుడు b) వాగ్భటుడు c) శుశ్రుతుడు d) చరకుడు
109. తొలి శాతవాహనుల నాణెములు ఎక్కడ లభ్యమయినాయి
110. కనిష్కుని యొక్క నాణెములు మరియు శాసనములు ఎక్కువగా ఏ భాషలో అభ్యమవుతున్నాయి
111. క్రింది వానిని జతపరచుము
జాబితా - I (యుద్ధములు)
(a) మొదటి తరాయిన్ యుద్ధం
(b) ఖాన్వా యుద్ధం
(c) తల్లికోట యుద్ధం
(d) హల్దీగాట్ యుద్ధం
జాబితా - II (సంవత్సరము)
(i) 1191
(ii) 1576
(iii) 1565
(iv) 1527
112. క్రింది వానిలో ఏ వాఖ్యానం విజయనగరమునకు సంబంధించి సరి అయినది కాదు
113. క్రింది వానిని జతపరచుము
జాబితా - I (రాజ్యం)
(a) అహ్మూద్నగర్
(b) బెరార్
(c) బీజాపూర్
(d) గోల్కొండ
జాబితా - II (పరిపాలించిన వంశం)
(i) అదిల్ షాహిలు
(ii) నిజామ్ షాహిలు
(iii) ఇమద్ షాహిలు
(iv) కుతుబ్ షాహిలు
114. మధ్యయుగం నాటి ఏ సుల్తాన్ 'సతి' ఆచారమును దురాచారమని భావించి నిషేధించెను
115. ఈ క్రింది ఆలయములలో దేనిలో ఎక్కువగా 'హద్దులేని శృంగార భంగిమలతో' కూడిన శిల్పములు కలవు
116. ప్రతిపాదన (A): అంతర్గతంగా కాని, బాహ్యంగా కాని మొగల్ పాదుషాలు పూర్తి సార్వభౌమాధికారమును కల్గి ఉన్నారు
కారణం (R): వీరు ఎవరి ముఖ్యంగా ఖలీఫా యొక్క అధికారమును గుర్తించలేదు
117. ఈ క్రింది వాటిలో ఏ కోటను శివాజీ, బీజాపూర్ నుండి ఆక్రమించలేదు
118. 1853లో డల్హౌసి ద్వార ప్రవేశపెట్టబడిన తంతితీగలు (telegraphic line) ఈ క్రింది వాటి మధ్య వేసారు
119. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ యొక్క తొలినాటి కార్యక్రమములను గమనించి “కాంగ్రెస్ అంటే మూడు రోజుల తమాషా తప్ప మరేది కాదు” అని నుడివింది
120. క్రింది ప్రతిపాదనలలో ఏది సత్యాగ్రహమునకు సంబంధించి సరి అయింది కాదు
121. బోధన్ పూర్వ నామం ఏమిటి?
122. క్రింది వానిని జతపరచుము
(a) హాలిక
(b) కోలిక
(c) కులరిక
(d) వదిక
(i) వడ్రంగి
(ii) వ్యవసాయదారుడు
(iii) నేతపనివారు
(iv) కుమ్మరి
123. తెలంగాణలోని ఏ ప్రదేశంలో పెద్దమొత్తంలో రోమన్ నాణెములు బయల్పడినాయి
124. ప్రాచీన కాలంలో ఈ క్రింది నదులలో ఏది 'తెలివాహ' గా పిలువబడింది?
125. 'కవిజనాశ్రయం' గ్రంధ రచయిత ఎవరు?
126. ఉత్తర తెలంగాణకు చెందిన బావరి బౌద్ధమతాన్ని స్వీకరించి దానిని వ్యాప్తి చేసినాడు. అయన గురించి ఈ క్రింది గ్రంధాలలో ఏది తెలుపుతుంది?
127. మధ్య యుగాలలో ఈ క్రింది వానిలో దేనిని సుల్తాన్పూర్గా పిలువబడింది
128. ఈ క్రింది రాజ వంశాలలో ఎవరు గ్రామ పరిపాలనలో ఆయగార్ విధానాన్ని ప్రవేశపెట్టినారు
129. కాకతీయ సైన్యాలకు మరియు సారక్క కుమారుడు జంపన్నకు మధ్య యుద్ధం ఎక్కడ జరిగింది
130. క్రింది వానిని జతపరచుము
(a) రేలా నృత్యం
(b) గూసాడి నృత్యం
(c) ముత్యంపేట
(d) భీమ్‌గల్
(i) కొండగట్టు జాతర
(ii) లింబాద్రిగుట్ట
(iii) కోయలు
(iv) గోండులు
131. ఏ శాసనం రుద్రదేవుని 'వినయ భూషణుడు' అని తెలుపుతుంది
132. పురుషులను రంజింపచేయుటం కొసం స్త్రీలు చేసే పేరిని నృత్యాన్ని ఏమంటారు
133. క్రింది వానిని జతపరచుము
(a) బయ్యారం చెరువు
(b) పాకాల చెరువు
(c) కేసముద్రం చెరువు
(d) నాగసముద్రం చెరువు
(i) జగడాల ముమ్మడ
(ii) మొదటి ప్రోలరాజు
(iii) మైలాంబ
(iv) నాగాంబిక
134. క్రింది వజ్రాల గనుల ప్రదేశాలలో ఏది తప్పుగా జతపర్చబడింది
135. కుతుబ్‌షాహిల పరిపాలనాకాలంలో ఈ క్రింది వాటిలో ఏది నీలి మందు ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది
136. క్రింది వానిని జతపరచుము
(a) శివదేవయ్య
(b) ఏకామ్రనాధుడు
(c) మంచన
(d) శాకల్యమల్ల
(i) ప్రతాప చరిత్రం
(ii) నిరోష్ఠ్య రామాయణం
(iii) పురుషార్థ సారం
(iv) కేయూరబాహు చరిత్ర
137. క్రింది వానిని కాలానుక్రమంగా అమర్చుము
(a) సికందర్ జా (b) మీర్ మహాబూబ్ అలీఖాన్ (c) వాసిరుద్దౌలా (d) నిజాం ఆలీ
138. క్రింది వానిలో తెలుగులో మొట్టమొదటి యక్షగానం ఏది
139. లంబాడీల మూలపురుషుల జీవిత చరిత్రలను ఈ క్రింది వారిలో ఎవరు గానం చేస్తారు
140. యానాది భాగవతాన్ని ఈ విధంగా పిలుస్తారు
141. హైదరాబాద్‌లో అక్కన్న-మాదన్న దేవాలయం ఎక్కడ ఉంది?
142. హైదరాబాద్ నందు 1857 తిరుగుబాటును అణచడంలో ఈ క్రింది వారిలో ఏ సంస్థానాధీశుడు బ్రిటీష్ వారికి సహాయపడినాడు.
143. తెలంగాణలోని ఈ క్రింది జిల్లాలలో ఎక్కడ శివరాం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది
144. హైద్రాబాద్ రాజ్యం పై జరిపిన పోలీస్ చర్యను ఈ విధంగా కూడ పిలుస్తారు?
145. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో 'విసునూరు దొర'కు వ్యతిరేకంగా ఈ క్రింది వారిలో ఏ లంబాడా నాయకుడు పోరాటం చేసినాడు.
146. 'తెలంగాణ తల్లి' విగ్రహ రూపకల్పనలో ఈ క్రింది వారిలో ఎవరు భాగస్వామి కాదు.
147. హైద్రాబాద్ 1952 ముల్కీ ఉద్యమ ఘటనల పై దర్యాప్తు జరిపిన ఈ క్రింది వారిలో ఎవరు నాయకత్వం వహించారు
148. 1969 జై తెలంగాణ ఉద్యమకాలంలో ఈ క్రింది వారిలో ఎవరు మొట్టమొదట ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు
149. క్రింది వాటిని కాలానుక్రమంలో అమర్చుము
(a) ఎనిమిది సూత్రాల పథకం (b) ఆరు సూత్రాల పథకం (c) అయిదు సూత్రాల పథకం (d) ప్రెసిడెన్షియల్ ఆర్డర్
150. క్రింది వానిని జతపరచుము
జాబితా - I
(a) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు
(b) తెలంగాణ స్టూడెంట్స్ ఫోరం
(c) తెలంగాణ ఐక్య వేదిక
(d) తెలంగాణ జనసభ
జాబితా - II
(i) 1997
(ii) 1998
(iii) 1991
(iv) 1986
151. క్రింది వాటిని కాలానుక్రమంగా అమర్చుము
(a) సకలజనుల సమ్మె (b) మిలియన్ మార్చ్ (c) సాగర హారం (d) సడక్ బంద్
152. తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీకి ఎవరు కన్వీనర్‌గా ఉండిరి
153. క్రింది వానిలో ఏది సరిఅయిన జతకాదు.
154. సకలజనుల సమ్మెకు ఈ క్రింది వారిలో ఎవరు పిలుపునిచ్చారు
155. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండె లోక్‌సభలో ఎప్పుడు ప్రవేశపెట్టినాడు?
156. ప్రతిపాదన (A): వేసవి కాలంలో అంతర ఆయనరేఖా అభిసరణ మండలం భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉంటుంది.
కారణం (R): అంతర ఆయనరేఖా అభిసరణ మండలం ఉత్తర దిక్కుగా భారతదేశం వైపు వెళ్ళడం వల్ల బుతుపవనాలు ఏర్పడేందుకు దారితీస్తాయి.
157. క్రింది వానిని జతపరచుము:
జాబితా - I
(a) ఆటోట్రాప్లు
(b) హెట్రోట్రాప్లు
(c) ట్రాఫిక్ స్ట్రక్చర్ (ట్రాఫిక్ నిర్మాణం)
(d) ఆహార వలయం (ఫుడ్ చైన్)
జాబితా - II
(i) ఒక లెవల్ నుండి ఇంకో లెవల్‌కి శక్తి మార్చిడి
(ii) జీవుల శ్రేణీయుత క్రమబద్ధీకరణ
(iii) ఆహారం కొరకు ఇతర జీవులపై ఆధారపడడం
(iv) ఆహారాన్ని తామే తయారుచేసుకోవడం
158. క్రింది వానిని జతపరచుడి:
జాబితా - I
(a) గురు శిఖర శిఖరాగ్రం
(b) దూదార్ జలపాతం
(c) థాల్గట్ గ్యాప్
(d) ప్రవాళ భిత్తికలు
జాబితా - II
(i) లక్షద్వీపాలు
(ii) పశ్చిమ కనుమలు
(iii) నర్మదా నది
(iv) ఆరావళులు
159. క్రింది వానిని జతపరచుము :
జాబితా - I
(a) కల్పక్కం
(b) నరోరా
(c) కైగా
(d) కాక్రపారా
జాబితా - II
(i) గుజరాత్
(ii) కర్ణాటక
(iii) ఉత్తర ప్రదేశ్
(iv) తమిళనాడు
160. ప్రతిపాదన (A): దక్షిణ చైనాలో జనించే ఉష్టమండల చక్రవాతాలను టైఫూనులంటారు.
కారణం (R): ఉష్టమండల చక్రవాతాల సమీపణ రేఖలు వర్తులాకారంలో ఉంటాయి.
161. ప్రతిపాదన (A): గ్రీన్ హౌస్ ఎక్కువగానుండడం వల్ల మరియు ఓజోన్ పొర క్షయం వల్ల ప్రపంచ తాపీకరణ గ్యాసులు ఏర్పడుతుంది.
కారణం (R): సముద్ర మట్టం పడిపోవుటకు ప్రపంచ తాపీకరణే కారణాంశం.
162. క్రింది వ్యాఖ్యలను చదువుము :
a) జాతీయ సలహా మండలిని ఎన్డిఏ ప్రభుత్వము ఏర్పరచినది
b) సోనియా గాంధీ జాతీయ సలహా మండలి అధ్యక్షురాలు
c) కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వములకు జాతీయ సలహా మండలి సలహాలు ఇచ్చును
d) జాతీయ సలహా మండలి అధ్యక్షుడు ప్రధాన మంత్రి
సరైన వ్యాఖ్యలు ఏవి?
163. 1998 అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రములను మొదటిసారి ఏ రాష్ట్రాలలో ఉపయోగించారు?
a) మధ్యప్రదేశ్, రాజస్తాన్ మరియు హిమాచల్‌ప్రదేశ్
b) రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ మరియు బిహార్
c) మధ్యప్రదేశ్ మరియు కేరళ
d) మధ్యప్రదేశ్, రాజస్తాన్ మరియు ఢిల్లీ
164. ప్రతిపాదన (A): రాష్ట్ర జాబితాలోని అంశములపై పార్లమెంట్ చట్టము చేయవచ్చును జాతీయ ప్రయోజనం దృష్ట్యా.
కారణం (R): రాజ్యసభ పార్లమెంట్లో భాగము
165. క్రింది వ్యాఖ్యలను చదువుము :
a) రాజ్యసభలో ప్రస్తుత సభానాయకుడు అరుణ్ జైట్లీ
b) లోక్‌సభలో ప్రస్తుత సభానాయకుడు నరేంద్ర మోడీ
c) రాజ్యసభలో ప్రస్తుత సభానాయకుడు వెంకయ్యనాయుడు
d) లోక్‌సభలో ప్రస్తుత సభానాయకుడు రాజనాధ్ సింగ్
సరైన వ్యాఖ్యలను తెలుపుము :
166. ప్రతిపాదన (A): భారతదేశము గణతంత్ర రాజ్యము
కారణం (R): భారతదేశములో విశ్వజనీన వయోజన వోటు హక్కు వ్యవస్థ ఉన్నది
167. ప్రతిపాదన (A): మంత్రి మండలిలో ఐక్యత మరియు సమన్వయ భావమును కాబినెట్ సమిష్టి బాధ్యత సూత్రము సూచించును.
కారణం (R): కాబినెట్ సభ్యుని నియమించడము మరియు తొలగించడము ప్రధానమంత్రి విచక్షణకు చెందినది
168. క్రింది వ్యాఖ్యలను చదువుము :
a) షణ్ముఖనాథన్ మేఘాలయ గవర్నర్‌గా నియమింపబడెను
b) ద్రౌపది మర్ము జార్ఖండ్ గవర్నర్‌గా నియమింపబడెను
c) తథాగతరాయ్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమింపబడెను
d) నజ్మా హెప్తుల్లా మిజోరాం గవర్నర్‌గా నియమింపబడెను
సరైన వ్యాఖ్యలను తెలుపుము :
169. భారతదేశములో 'సమ్మిళిత వృద్ధి'లోని రెండు ప్రధాన అంతర్భాగాలు ఏవి?
A) గతంలో విస్మరించబడిన వర్గాల వారికి ఆర్థిక ప్రతిఫలాలు అందజేయడం
B) మ్యానుఫాక్చరింగ్ (తయారీ) వస్తువులను ఎగుమతి చేయడం
C) పేదరిక నిర్మూలన తగ్గింపు, ఉపాధి కల్పన
D) పర్యావరణ విచ్ఛేదన
170. జనాభా విస్ఫోటనకు సంబంధించి క్రింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
171. క్రింది వారిలో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందినది ఎవరు?
172. పేదరికానికి సంబంధించి క్రింది వాటిలో ఏ వ్యాఖ్యలు సరైనవి?
A) సామాజికార్థిక దృగ్విషయమైన పేదరికంలో తమ కనీస జీవితావసరాలను తీర్చుకోలేని స్థితిలో సమాజంలోని ప్రజలు ఉంటారు.
B) ప్రతి పేద వ్యక్తి ఆదాయాన్ని దారిద్ర్య రేఖ సూచించే ఆదాయానికి సమానమయ్యే వరకు బదిలీ చేసే తీరును పేదరిక వ్యత్యాసం తెలుపుతుంది.
C) కనీస భౌతిక జీవన వ్యయాన్ని లేదా ఆదాయాన్ని కూడా పొందలేని ప్రజల స్థితిని 'సాపేక్ష వ్యయం'గా చెప్పవచ్చు.
173. క్రింది వాటిలో ప్రాంతీయ అసమతుల్యతకు సంబంధించి రెండు ప్రధాన ఆర్థిక సూచికలు ఏవి?
A) సమ్మిళిత వృద్ధి B) పేదరిక స్థాయి C) రాష్ట్రాల తలసరి ఆదాయాలు D) సామాజిక న్యాయం
174. క్రింది వాటిలో పర్యావరణపు ఆవరణలు ఏవి?
A) వాతావరణం (Atmosphere) B) జీవావరణం C) జలావరణం D) శిలావరణం
175. క్రింది వాటిలో ఏ దశాబ్దాన్ని ఐక్యరాజ్య సమితి 'సుస్థిర అభివృద్ధి కొరకై విద్యా దశాబ్దం'గా ప్రకటించింది?
176. జతపరచుము:
సంస్థ
(a) సరిహద్దు భద్రతా దళం
(b) ఇండో-టిబెటన్ సరిహద్దు రక్షణ దళము
(c) సశస్త్ర సీమ బలము
(d) తీరప్రాంత రక్షక దళము
స్థాపక సంవత్సరము
(i) 1963
(ii) 1965
(iii) 1978
(iv) 1962
177. క్రింది వాటిలో సరియైనవి కానివి ఏవి :
a) నేషనల్ ఫిజికల్ లాబరేటరీ లక్నోలో కలదు.
b) భారత పరిశోధనా కేంద్రము హిమాద్రి ఆర్కిటిక్ రీజియన్‌లో కలదు.
c) సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్లో కలదు.
d) రైస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ భువనేశ్వర్‌లో కలదు.
178. క్రింది వ్యాఖ్యలను చదవండి:
A) 2014, కామన్వెల్త్ క్రీడలు కౌలాలంపూర్‌లో నిర్వహింపబడ్డాయి
B) 2016, కబడ్డి ప్రపంచ కప్పుకు అహ్మదాబాద్ ఆతిథ్యమిస్తుంది
C) 2015, జాతీయ క్రీడలు కేరళలో నిర్వహింపబడ్డాయి
సరైన వ్యాఖ్యలను తెలపండి:
179. భారతదేశములో ఎత్తైన వంతెన ఏది?
180. మహాత్మ గాంధీ శాంతి బహుమతి, 2014 పొందినవారు
181. క్రింది వానిని జతపరచుము :
జాబితా - I (దినోత్సవం)
a) ధరిత్రి దినోత్సవం
b) అంతర్జాతీయ పులుల దినోత్సవం
c) ప్రపంచ సముద్రాల దినోత్సవం
d) జాతీయ క్రీడా దినోత్సవం
జాబితా - II (తేదీ)
i) ఏప్రిల్ 22
ii) జూన్ 8
iii) జూలై 29
iv) ఆగస్టు 29
182. క్రింది వ్యాఖ్యలను చదవండి:
A) దేశములో అంతర్గత భద్రతా చట్టాన్ని రచించుకున్న మొదటి రాష్ట్రము మహారాష్ట్ర
B) 2017లో భారతీయ ప్రవాస దివసుకు ఆతిథ్యం ఇచ్చేది హైదరాబాద్ నగరం
C) భారతదేశంలో ఇటీవలే అవతరించిన తొలి ద్వీప జిల్లా మజూలి
సరైన వ్యాఖ్యలను తెలుపండి:
183. క్రింది వాటిలో లింగ నిష్పత్తి అంటే ఏది?
184. సరియైన జతను సూచించుము
ఆర్మీ నావి ఎయిర్‌ఫోర్స్
(1) కెప్టెన్ సబ్‌లెఫ్టినెంట్ ఫ్లయిట్ లెఫ్టినెంట్
(2) మేజర్ కమాండర్ స్క్వాడ్రన్ హెడర్
(3) కల్నల్ కమాండర్ ఎయిర్ కమాండర్
(4) మేజర్-జనరల్ రేర్ అడ్మిరల్ ఎయిర్ వైస్ మార్షల్
185. ప్రతిపాదన (A): భారతదేశంలో ఒక మిలియన్ జనాభాతో నున్న నగరాన్ని మెట్రోపాలిటన్ సిటి అని పిలుస్తారు.
కారణం (R): 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో కేవలం 12 మాత్రమే మెట్రోపాలిటన్ సిటీలు (నగరాలు) కలవు.
186. క్రింది వివరణలను చదవండి :
A) దారిద్ర్య రేఖకు దిగువన గల మహిళలకు స్వయం ఉపాధిని కల్పించడానికి డ్వాక్రా పథకం ఉద్దేశించబడింది.
B) జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని 1980వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు
C) ఉద్యోగితా స్థితిని లెక్కించడానికి సాధారణ స్థితి, వారపరమైన స్థితి మరియు రోజువారీ స్థితి అను మూడు భావనలను ఎన్ఎస్ఎస్ సంస్థ వాడింది
D) గ్రామీణ ప్రాంతాలలో వేతన ఉపాధిని కల్పించడానికి ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన ఉద్దేశించబడింది
పై వివరణములలో ఏవి సరియైనవి?
187. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి (ప్రస్తుతము)
188. క్రింది వాటిలో మూడు ప్రధాన కాలుష్య రకాలు (రూపాలు) ఏవి?
A) వాయు కాలుష్యం B) నీటి కాలుష్యం C) ధ్వని కాలుష్యం D) ధరిత్రి కాలుష్యం
189. జాతీయ షెడ్యూల్డ్ కులాల/తెగల హబ్‌ను ప్రారంభించే నగరము
190. ప్రపంచములో అత్యంత పెద్దదైన సౌరశక్తి ఉత్పత్తి కేంద్రమును ప్రారంభించిన రాష్ట్రము
191. ఓటర్ల సంఖ్య రీత్యా అతి చిన్న లోక్‌సభ నియోజక వర్గము
192. క్రింది వానిని జతపరచుము:
రోజు (ప్రాముఖ్యత)
a) ప్రపంచ కిడ్నీ రోజు
b) ప్రపంచ కాన్సర్ రోజు
c) ప్రపంచ క్షయ రోజు
d) ప్రపంచ వికలాంగుల రోజు
నెల
i) ఫిబ్రవరి 14
ii) మార్చి 24
iii) మార్చి 10
iv) డిసెంబర్ 3
193. మొదటి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ నెలకొల్పిన ప్రదేశం
194. క్రింది వాటిలో సరియైన జత కానిది :
స్టేడియమ్ ప్రదేశము
(1) కీనన్ స్టేడియమ్ జంషెడ్పూర్
(2) శివాజీ స్టేడియమ్ పూణె
(3) రంజి స్టేడియమ్ కోలకతా
(4) డి.వై.పాటిల్ స్టేడియమ్ నవీ ముంబయి
195. క్రింది వానిని జతపరచుము
రోజు
a) జాతీయ శాస్త్ర దినము
b) వాయుసేన దినము
c) నౌకాదళ దినము
d) ఉగ్రవాద వ్యతిరేక దినము
తారీఖు
i) అక్టోబర్, 8
ii) ఫిబ్రవరి, 28
iii) మే, 21
iv) డిసెంబర్, 4
196. క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము:
a) 2015లో సుప్రీం కోర్టు సామాజిక న్యాయ బెంచ్‌ను ఏర్పరచినది.
b) సుప్రీం కోర్టు సామాజిక న్యాయ బెంచ్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్. దత్తు ఏర్పరచినాడు.
c) ప్రతి శుక్రవారము సామాజిక న్యాయ బెంచ్ వ్యాజ్యములను పరిశీలించును.
సరియైన వ్యాఖ్య(లు) :
197. డినోటిఫైడ్ మరియు సంచార జాతుల కమిషన్ చైర్మన్:
198. భారత నేపాల్ మైత్రి బస్ సర్వీస్ కలిపే నగరాలు
199. క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము:
a) ఆపరేషన్ రాహత్, 2015 కు నాయకత్వం వహించినది జనరల్ వి.కె. సింగ్.
b) సిరియా నుండి భారత పౌరులను రక్షించేందుకు ఏర్పర్చినది ఆపరేషన్ రాహత్.
c) ఆపరేషన్ రాహత్‌లో ఐఎన్ఎస్ సుమిత్రను ఉపయోగించినారు.
సరైన వ్యాఖ్యలు:
200. క్రింది వానిని జతపరచుము:
మంత్రి
(a) హెచ్.ఎం. పటేల్
(b) ఇంద్రజిత్ గుప్తా
(c) మధు దండావతె
(d) జార్జ్ ఫెర్నాండేజ్
కేంద్ర ప్రభుత్వము
(i) ఆర్థిక శాఖ మంత్రి, జాతీయ ఫ్రంట్ ప్రభుత్వము
(ii) రక్షణ శాఖ మంత్రి, ఎన్‌డిఎ-I ప్రభుత్వము
(iii) ఆర్థిక శాఖ మంత్రి, జనతా ప్రభుత్వము
(iv) హోం శాఖ మంత్రి, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వము