← అధ్యాయాలు

14. నిజాం- 5 (సాలార్‌జంగ్ సంస్కరణలు)

60 ప్రశ్నలు
1. మొగలాయి పరిపాలనను అంతమొందించి రాష్ట్రంలో నూతన పద్ధతితో పరిపాలన ప్రారంభించిన ఘనత ఎవరికి దక్కుతుంది?
2. సాలార్‌జంగ్ ప్రధానిగా రాకపూర్వం ఖాల్సా (ప్రభుత్వ) గ్రామాలలో కూడా ఏ పద్ధతి అమలులో ఉండేది?
3. కొన్ని భూములపై నిర్ణీత పద్ధతిపై కౌలుమీద తీసుకున్నవారు ఏం చేసేవారు?
4. రైత్వారీ పద్ధతి అమలుకు రాకపూర్వం భూమిశిస్తు వసూళ్ళను ఎలా చేసేవారు?
5. వేలంపాటలో పైచేయి చేసుకున్న కౌలు విధానాన్ని ఏమని పిలిచేవారు?
6. సర్బరస్తా కాలంలో తాహుతు దార్లు లేదా బిల్ మక్తాదార్లు ప్రభుత్వానికి చెల్లించవలసిన మొత్తానికి ఎలా వసూలు చేసుకునేవారు?
7. సర్బరస్తా విధానాన్ని ఎవరు రద్దుపరిచారు?
8. సాలార్‌జంగ్ భూమిని ఏం చేయించి నేరుగా ప్రభుత్వ యంత్రాంగం ద్వారా శిస్తు వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాడు?
9. సర్బరస్తా కాలంలో ఉన్న కంట్రాక్టర్లకు ఏఏ బిరుదులిచ్చి పరిహారాలు చెల్లించారు?
10. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో 500 ఎకరాలకు పైబడిన భూస్వాములు ఎంత శాతం భూమిని తమ చేతుల్లో ఉంచుకున్నారు?
11. 1942లో చేసిన సర్వే ప్రకారం రాష్ట్రమంతటా ఎంతమంది దేశముఖులు, దేశపాండ్యాలు, దేశాయిలు, సర్దేశాయిలు ఉండేవారు?
12. నిర్మానుష్యమైన గ్రామాలలో పునరావాసం కల్పించటానికి యోగ్యమైన భూములను వ్యవసాయంలోకి తెచ్చే ఉద్దేశంతో సాలార్‌జంగ్ ఏ మార్గాన్ని ప్రవేశపెట్టాడు?
13. ఇజారా/కౌలు పద్ధతిని ఎప్పుడు రద్దు చేశారు?
14. సాలార్‌జంగ్ రాష్ట్రంలో రైత్వారీ పద్ధతిని ఎప్పుడు ప్రవేశపెట్టాడు?
15. రైత్వారీ సెటిల్‌మెంటును ప్రారంభంలో ఎన్ని సంవత్సరాలుగా నిర్ణయించారు, తర్వాత ఎన్ని సంవత్సరాలకు తగ్గించారు?
16. తరీ (మాగాణి) సేద్యానికి నిర్బంధం చేసి, ఈ రేటు ఎకరాకు ఎంత ఉండేది?
17. తరీ శిస్తు రేటు ఎప్పుడు రద్దయ్యింది?
18. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఎప్పుడు జరిగింది?
19. జిల్లాల రెవిన్యూ పాలనకోసం ఏఏ తాలుక్దార్ల పదవులను సృష్టించారు?
20. కలెక్టర్లమీద పర్యవేక్షణకోసం ఏం ఏర్పరిచారు?